Riteish: వరద బాధితులకు నటి జెనీలియా దంపతుల భారీ విరాళం

  • వరదలతో అతలాకుతలమైన మహారాష్ట్ర
  • ఇప్పటికీ వరద గుప్పిట్లో పలు ప్రాంతాలు
  • జెనీలియా దంపతులను అభినందించిన సీఎం ఫడ్నవిస్

తెలుగులో పలు సినిమాల్లో నటించిన జెనీలియా మహారాష్ట్ర వరద బాధితులకు తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భర్త రితేశ్‌తో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి చెక్‌ను అందించింది. ఈ విషయాన్ని సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

వరదలతో ఇటీవల మహారాష్ట్ర అతలాకుతలమైంది. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. సంగ్లీ, కొల్హాపూర్, సతార జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం 432 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసింది. మొత్తం 3.78 లక్షల మంది ప్రజలను ఈ కేంద్రాలకు తరలించారు. కాగా, వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన జెనీలియా దంపతులను సీఎం ఫడ్నవిస్ అభినందించారు.

Riteish
Genelia Deshmukh
Devendra Fadnavis
donation
Maharashtra floods
  • Loading...

More Telugu News