Hong Kong: నిరసనల నేపథ్యంలో.. అన్ని విమాన రాకపోకలను ఆపివేసిన హాంకాంగ్

  • నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్
  • ప్రధాన టెర్మినల్ వద్ద భారీ సంఖ్యలో నిరసనకారులు
  • చెకిన్ లను కూడా ఆపివేసిన అధికారులు

హాంకాంగ్ లోని నిందితులను చైనాకు అప్పగించే ముసాయిదా చట్టంపై అక్కడ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనకారుల ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద కూడా భారీ సంఖ్యలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్టు వద్ద గత నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రధాన టెర్మినల్ బిల్డింగ్ వద్ద భారీ సంఖ్యలో నిరసనకారులు గుమికూడారు. ఈ నేపథ్యంలో, అన్ని విమాన రాకపోకలను హాంకాంగ్ ఆపివేసింది. చెకిన్ లను అధికారులు ఆపివేశారు. ఈరోజు మొత్తం విమానరాకపోకలు ఉండవని ఎయిర్ పోర్ట్ యాజమాన్యం ప్రకటించింది.

Hong Kong
Airport
Flights
  • Loading...

More Telugu News