Karnataka: కర్ణాటకలో భారీ వర్షాలు.. ఇంటిపైకి చేరి సేదదీరుతున్న మొసలి.. వీడియో ఇదిగో!

  • బెల్గామ్ లోని రేబక్ ప్రాంతంలో ఘటన
  • ఉప్పొంగిన వరదనీరు.. ఇంటిపైకి మొసలి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

భారీ వర్షాలు, వరదలకు కర్ణాటక అల్లాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా బెళగావి, బాలాకోటే ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో నిరాశ్రయులైన లక్షలాది మందిని ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలించాయి.

మరోవైపు వరద నీరు ఉప్పొంగడంతో ఉభయచరాలు ఎత్తైన ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. తాజాగా బెల్గామ్ లోని రేబక్ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరుకోవడంతో ఓ మొసలి ఏటూ వెళ్లలేకపోయింది. దీంతో అక్కడే ఉన్న ఇంటి పైకప్పు పైకి  చేరుకుని సేదతీరడం ప్రారంభించింది. దీన్ని ఓ వ్యక్తి ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. ఎడతెరిపిలేని వర్షాలకు కర్ణాటకలో ఇప్పటివరకూ 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

Karnataka
Heavy rains
flood
crocodile
lands on roof of a house
Raybag taluk in Belgaum
Twitter
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News