Nellore: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా ఇంటికి వచ్చాడు.. చంపేస్తానని బెదిరించాడు: డోలేంద్ర ప్రసాద్ ఆరోపణ

  • ‘జమీన్ రైతు’ లో తనను అరాచక శక్తితో పోల్చారని కోటంరెడ్డి నాతో అన్నారు
  • అసభ్యకర పదజాలంతో మాట్లాడారు
  • ‘నిన్ను ఇప్పుడు చంపేసి పోతాను..3 పేజీలు రాసుకో’ అని బెదిరించారన్న బాధితుడు  

‘జమీన్ రైతు’ వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డోలేంద్ర ప్రసాద్ ను మీడియా కలిసింది. ఈ ఘటన గురించి ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, ‘నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 7.30 ప్రాంతంలో మా ఇంటికి వచ్చాడు. ఆ టైమ్ లో నేను బయట నిలబడి ఉన్నాను’ అని చెప్పారు. కోటంరెడ్డి నేరుగా తమ ఇంట్లోకి వెళ్లడంతో, తాను కూడా ఆయన వెనకాలే వెళ్లానని చెప్పారు.

‘ఆ టైమ్ లో బెంగళూరులో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ వసుంధర మా ఇంటికి పలకరింపు కోసం వచ్చింది. ఆ అమ్మాయిని కూడా తీసుకుని లోపలికి వచ్చాడు (కోటంరెడ్డి). లోపలికి వచ్చిన తర్వాత అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘‘జమీన్ రైతు’ లో నన్ను అరాచక శక్తి అని చెప్పి రాశారు.. నిన్ను ఇప్పుడు చంపేసి పోతాను, పొడిచేసి పోతాను, ఈసారి, మూడు పేజీలు రాసుకో’ అని బెదిరించారు’ అని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు.

Nellore
Rural
District
Jaminu rytu
Dolendra
  • Error fetching data: Network response was not ok

More Telugu News