India: ఇక కొత్త సినిమాను రిలీజ్ రోజునే ఇంట్లో చూడొచ్చు.. సంచలన ప్రకటన చేసిన ముఖేశ్ అంబానీ!

  • ‘జియో ఫస్ట్ డే.. ఫస్ట్ షో మూవీస్’ పథకం ఆవిష్కరణ
  • ఇది జియో ప్రీమియం కస్టమర్లకు మాత్రమే పరిమితం
  • ఫైబర్ కస్టమర్లకు హెచ్ డీ ఎల్ఈడీ టీవీ, 4కె సెటప్ బాక్స్ ఫ్రీ

రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ సినిమాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రజలు థియేటర్లకు వెళ్లి, క్యూలైన్లలో నిల్చోవాల్సిన పనిలేకుండా కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేరోజునే వాటిని ఇంట్లోనే కూర్చుని చూడవచ్చని ప్రకటించారు. ఈ సౌలభ్యం  ప్రీమియం జియో ఫైబర్ కస్టమర్లకు మాత్రమేనని చెప్పారు.

2020 మధ్యలో  ‘జియో ఫస్ట్ డే.. ఫస్ట్ షో మూవీస్’ పేరిట ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అలాగే జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ‘జియో పోస్ట్ పెయిడ్ ప్లస్’ అనే పథకాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇక జియో ఫైబర్ కనెక్షన్ లో భాగంగా వార్షిక ప్లాన్ తీసుకునే కస్టమర్లకు హెచ్ డీ ఎల్ ఈడీ టీవీ, 4కె సెటప్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించారు.

India
jio
Reliance
New movie release
Watch at your home
mukesh ambani
  • Loading...

More Telugu News