Article 370: కండబలంతో ఆర్టికల్ 370ని రద్దు చేసిన వారికి చరిత్ర గురించి ఏం తెలుసు?: చిదంబరం

  • ముస్లింలు ఎక్కువగా ఉన్నారనే ఆర్టికల్ 370ని రద్దు చేశారు
  • కశ్మీర్ లో హిందువులు ఎక్కువగా ఉంటే దాని జోలికి వెళ్లేవారు కాదు
  • ఆర్టికల్ రద్దుకు ఏడు పార్టీలు మద్దతివ్వడం బాధించింది

మోదీ ప్రభుత్వం కండబలంతో ఆర్టికల్ 370ని రద్దు చేసిందని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మండిపడ్డారు. ఆ పని చేసిన వారికి 72 ఏళ్ల చరిత్ర తెలియదని అన్నారు. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని చెప్పారు. ఈ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే అవి బీజేపీకే ఉండాలని అన్నారు. కశ్మీర్ లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్లే ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని... ఆ రాష్ట్రంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టైతే రద్దు చేసేది కాదని చెప్పారు. తమిళనాడును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే... తమిళులు చూస్తూ ఉండిపోతారా? అని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడు పార్టీలు మద్దతును ప్రకటించడం తనను బాధించిందని చెప్పారు.

Article 370
Jammu And Kashmir
Chidambaram
Congress
BJP
  • Loading...

More Telugu News