Telangana: తెలంగాణలో ఇన్ని రోజులూ మీరు చేసింది అదేగా!: కేటీఆర్ కు విజయశాంతి కౌంటర్

  • బీజేపీ విధానాలపై కేటీఆర్ ఆగ్రహం
  • తెలంగాణలో టీఆర్ఎస్ అదే చేస్తోందన్న విజయశాంతి
  • ఇప్పటికైనా తత్వం బోధపడినందుకు సంతోషమని వ్యాఖ్య

బీజేపీపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. తనవరకూ వస్తే కాని అసలు తత్వం బోధపడలేదు అన్న చందంగా కేటీఆర్ నిర్వేదం ఉందని విజయశాంతి విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో  తమతో కలిసి ఉన్న వారే తెలంగాణ వాదులు... లేకపోతే తెలంగాణ ద్రోహులు అని టీఆర్ఎస్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కేటీఆర్ అభిప్రాయం ఎలాగుందో, ఇన్నిరోజులూ ప్రతిపక్షాలన్నీ అదే ఆవేదనతో కొట్టుమిట్టాడాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ అధిష్ఠానానికి అసలు తత్వం బోధపడినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లోనైనా టీఆర్ఎస్ అగ్రనాయకత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు విజయశాంతి తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు.

Telangana
TRS
Congress
vijayasanthi
BJP
KTR
  • Loading...

More Telugu News