Om prakash choutala: హరియాణా మాజీ సీఎం భార్య కన్నుమూత

  • ఆదివారం రాత్రి కన్నుమూసిన ఓం ప్రకాశ్ చౌతాలా భార్య
  • నేడ స్వగ్రామంలో అంత్యక్రియలు
  • ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న చౌతాలా

హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా భార్య స్నేహలత (81) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశాస్వ విడిచినట్టు వైద్యులు తెలిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న చౌతాలా.. భార్య చనిపోయినప్పుడు పక్కన లేరని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ సీనియర్ నేత అశోక్ అరోరా తెలిపారు.

తల్లి మృతి చెందిన వార్త తెలిసినప్పుడు ఆమె కుమారుడు అభయ్ చౌతాలా ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహలతను ఈ ఏడాది జనవరిలో ఆసుపత్రిలో చేర్చారు. కోలుకోవడంతో కొన్ని రోజులకే ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఇటీవల మళ్లీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. నేడు హరియాణాలోని చౌతాలా స్వగ్రామంలో స్నేహలత అంత్యక్రియలు జరగనున్నాయి.

Om prakash choutala
snehalatha
Hariyana
dead
  • Loading...

More Telugu News