Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అనుపమ మల్టీ టాస్కింగ్!
  • 'దొరసాని' హీరో తాజా చిత్రం 
  • కన్నడ రీమేక్ లో డా.రాజశేఖర్  

*  తనకి మల్టీ టాస్కింగ్ అంటే ఇష్టమంటోంది అందాలతార అనుపమ పరమేశ్వరన్. 'చిన్నప్పటి నుంచీ అంతే.. ఒకేసారి రెండు మూడు పనులు చేసేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక కూడా అటు చదువు కూడా కొనసాగించాను. ఇప్పుడూ అంతే, సినిమాలే కాదు, ఇంకా వేరే పనులు కూడా చేస్తూనే వుంటాను. ఇలా మల్టీ టాస్కింగ్ చేయడంలో ఓ థ్రిల్ వుంది' అని చెప్పింది.
*  'దొరసాని' చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేసుకున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తాడు.
*  ఇటీవల 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాక్టర్ రాజశేఖర్ ఆశించిన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రంగా  ఓ కన్నడ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ చిత్ర నిర్మాత ధనుంజయ దీనిని నిర్మిస్తారు.

Anupama
Vijay Devarakonda
Anand Devarakonda
Rajashekhar
  • Loading...

More Telugu News