Pawan Kalyan: ముస్లిం మతం పాటించే భారతీయులకు బక్రీద్ ఆంతర్యం లక్ష్యం కావాలి: పవన్ కల్యాణ్

  • రేపు బక్రీద్ పండుగ
  • ముస్లింలకు బక్రీద్ విషెస్ తెలియజేసిన జనసేనాని
  • బక్రీద్ త్యాగానికి ప్రతీక అంటూ ట్వీట్

ముస్లింలకు పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరసోదరీమణులందరికీ జనసేన తరఫున కూడా విషెస్ తెలియజేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బక్రీద్ పర్వదినం త్యాగనిరతికి ప్రతీక అని పవన్ పేర్కొన్నారు. కోరికలు, స్వార్థం, రాగద్వేషాలకు దూరంగా ఉంటూ మానవత్వమే పరమావధిగా మసలుకోవాలన్నదే బక్రీద్ అంతర్యమని, దీన్ని ముస్లిం మతం పాటించే భారతీయులు లక్ష్యంగా చేసుకోవాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan
Jana Sena
Bakrid
  • Loading...

More Telugu News