Andhra Pradesh: కోడెల శివప్రసాద్ కు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం!: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

  • కోడెల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు
  • సొంత పార్టీ నేతలే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు
  • తిరుమలలో మీడియాతో మాట్లాడిన కోన

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విమర్శించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలతో సహా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

కోడెలపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కోన రఘుపతి మీడియాతో మాట్లాడారు. కోడెల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొందో టీడీపీ నేతల ఫిర్యాదుతో తెలుస్తోందని చెప్పారు. ఓ సీనియర్ నేతకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
kona raghupati
kodela
  • Loading...

More Telugu News