Bonda Uma: ప్రస్తుతానికి ఏమీ మాట్లాడను... ఏం చెప్పినా బాబును కలిశాకే: బొండా ఉమ

  • ఉమ పార్టీ మారుతున్నట్టు వార్తలు
  • రేపు చంద్రబాబును కలవనున్న బొండా ఉమ
  • శనివారం నాడు బుద్ధా వెంకన్నతో చర్చలు

తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ స్పందించారు. ప్రస్తుతానికి ఈ విషయమై తానేమీ మాట్లాడబోనని, సోమవారం నాడు చంద్రబాబుతో భేటీ అవుతున్నన్నానని, ఆ తరువాత మీడియాతో మాట్లాడతానని వెల్లడించారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎన్నడూ చెప్పలేదని, మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయని అన్నారు.

ఇటీవలే విదేశాలకు వెళ్లి, తిరిగి వచ్చిన ఆయన, నిన్న శనివారం నాడు పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నను కలిశారు. ఆపై బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు సూచనల మేరకే తాను ఉమను కలిశానని అన్నారు. తెలుగుదేశం పార్టీ కాపులకు ఎంతో గుర్తింపును ఇచ్చిందని, రెండు నెలల కాలంలోనే వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఆ పార్టీకి భవిష్యత్‌ లేదని అన్నారు. బొండా ఉమ టీడీపీలోనే కొనసాగుతారని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.

Bonda Uma
Buddha Venkanna
Telugudesam
Vijayawada
  • Loading...

More Telugu News