Saaho: 'సాహో' థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది!

  • ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన 'సాహో'
  • ఆగస్టు 30న వరల్డ్ వైడ్ రిలీజ్
  • యాక్షన్ సన్నివేశాలో పొంగిపొర్లుతున్న ట్రైలర్

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా వస్తున్న చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ మేరకు వెల్లడించింది. భారత్ లో మునుపెన్నడూ రానంత అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ గా 'సాహో'ను పేర్కొంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే, మొదటి నుంచి చివరివరకు యాక్షన్ సన్నివేశాలతో ప్యాక్ చేశారని చెప్పాలి. మధ్యలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే స్టంట్లు, ఒళ్లు గగుర్పొడిచే థ్రిల్స్ సాహో చిత్రంలో లెక్కకు మిక్కిలిగా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Saaho
Prabhas
Theatricle Trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News