Vijayawada: టీడీపీ పాలనలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైంది: ఏపీ మంత్రి వెల్లంపల్లి విమర్శలు

  • విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో పర్యటన 
  • టీడీపీకి ప్రచారంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు
  • హజ్ హౌస్ నిర్మాణానికి నిధులు ఎందుకు కేటాయించలేదు?

టీడీపీ పాలనలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కబేళా సెంటర్ నుంచి ఈరోజు తన పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని విమర్శించారు.

నియోజకవర్గంలో ఆర్భాటంగా శిలాఫలకాలు మాత్రం వేశారని, నిధులు మాత్రం కేటాయించలేదని అన్నారు. నియోజకవర్గంలో గత ఏడాది మే లో హజ్ హౌస్ నిర్మాణం కోసం శిలాఫలకం వేసిన టీడీపీ, నిధులు కేటాయించకపోవడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దీన్ని తీర్చిదిద్దుతామని, ప్రణాళికా బద్ధంగా ముందుకెళతామని చెప్పారు.   

Vijayawada
west constituency
Minister
Vellampalli
  • Loading...

More Telugu News