Guntur District: ఏమిటీ రాక్షస పాలన?: ఏపీలో అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై చంద్రబాబు ఫైర్

  • చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు
  • వారిని వైసీపీ కార్యకర్తలు వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
  • ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా టీడీపీ చూస్తూ ఊరుకోదు

ఉద్యోగం మానివేయాలంటూ అంగన్ వాడి టీచర్ అజంతా బాయ్ పై వైసీపీ కార్యకర్తలు ఒత్తిడి చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు.

‘ఏమిటీ రాక్షస పాలన? చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోన్న మహిళలను ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వైసీపీ కార్యకర్తలు వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ఘటనలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా టీడీపీ చూస్తూ ఊరుకోదు’ అని ఓ ట్వీట్ లో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం లింగంగుట్ల తండాలో అంగన్ వాడీ టీచర్ అజంతా బాయ్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఉద్యోగం నుంచి తొలగించారన్న ఆవేదనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, ఉద్యోగం మానేయాలంటూ నెల రోజుల నుంచి వైసీపీ నాయకులు వేధిస్తున్నారని ఆరోపించడం ఆ వీడియోలో ఉంది.  

Guntur District
Lingamgutla
Anganwadi
Telugudesam
Chandrababu
Cm
Jagan
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News