Arun Jaitly: జైట్లీ ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎయిమ్స్

  • శ్వాస సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరిన జైట్లీ
  • ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించిన ఎయిమ్స్ డాక్టర్లు
  • చికిత్సకు స్పందిస్తున్నారని వివరించిన వైద్యులు

తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలైన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ నిపుణులైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధ  సమస్యతో జైట్లీ ఈ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎయిమ్స్ వైద్య బృందం మీడియాకు వివరాలు తెలిపింది. జైట్లీకి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వివరించారు. జైట్లీ గత కొన్నిరోజులుగా కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్నారు.

Arun Jaitly
AIIMS
New Delhi
  • Loading...

More Telugu News