Seetharam Yechuri: శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సీతారాం ఏచూరికి చేదు అనుభవం

  • శ్రీనగర్ ఎయిర్ పోర్టులో ఏచూరి, డి.రాజాలను అడ్డుకున్న అధికారులు
  • నగరంలోకి అడుగుపెట్టనివ్వని వైనం
  • సాయంత్రం ఢిల్లీకి వెనక్కి పంపే అవకాశం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాకు శ్రీనగర్ ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. శ్రీనగర్ కు చేరుకున్న వీరిద్దరినీ అధికారులు విమానాశ్రయంలోనే ఆపేశారు. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. శుక్రవారం ముస్లింల ప్రార్థనల సందర్భంగా కశ్మీర్ లో కర్ఫ్యూని సడలించే యోచనలో అధికారులున్నందున... వారిని నగరంలోకి అడుగుపెట్టనివ్వలేదు.

ఈ సందర్భంగా మీడియాతో ఫోన్ లో ఏచూరి మాట్లాడుతూ, శ్రీనగర్ లోకి ప్రవేశం లేదంటూ లీగల్ ఆర్డర్ ను అధికారులు చూపించారని తెలిపారు. భద్రతా కారణాల వల్ల ఎస్కార్ట్ తో వెళ్లడానికి కూడా అనుమతించలేదని చెప్పారు. మరోవైపు, ఈ సాయంత్రం ఇద్దరు నేతలను మరో విమానంలో ఢిల్లీకి వెనక్కి పంపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Seetharam Yechuri
Srinagar
CPM
CPI
  • Loading...

More Telugu News