Mahesh Babu: మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఫీస్ట్... 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రో విడుదల!

  • నేడు మహేశ్ పుట్టినరోజు
  • ఇంట్రో విడుదలతో కొత్తదనానికి నాంది  
  • సూపర్బ్ అంటున్న ఫ్యాన్స్

నేడు ఆగస్టు 9. అంటే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు. నేడు అభిమానులు తమ ఆరాధ్య నటుడికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, పలు ప్రాంతాల్లో రక్తదానాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ, వారికోసం ఆయన నటించే తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 ఇంతవరకూ ఫస్ట్ లుక్, టీజర్, ట్రయిలర్ ల పేరిట నూతన సినిమాల గురించిన సమాచారం వస్తుండగా, ఇప్పుడు 'ఇంట్రో'ను ఈ చిత్రంతో ప్రారంభించడం గమనార్హం. ఇక దీనిలో మహేశ్ కశ్మీర్ లోయలో భారత సైన్యం తరఫున విధులు నిర్వర్తించే సైనికుడిగా కనిపిస్తున్నాడు. బీజీఎం కూడా క్యాచీగా ఉంది. ఇక దీన్ని చూసిన వారంతా సూపర్బ్ అంటున్నారు. ఈ ఇంట్రోను మీరూ చూసేయండి.

Mahesh Babu
Sarileru Neekevvaru
Intro
Birthday
  • Error fetching data: Network response was not ok

More Telugu News