Kanakambaram: కనకాంబరాలు కావాలా? కిలో రూ. 2 వేలట!

  • నేడు వరలక్ష్మీ వ్రతం
  • ఆకాశాన్నంటిన పూల ధరలు
  • తప్పనిసరి అంటూ మహిళల కొనుగోళ్లు

మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూల ధరలు ఆకాశాన్నంటాయి. శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిన్న అమాంతం దూసుకెళ్లాయి. పూల మార్కెట్ లో వ్యాపారులు చెబుతున్న ధరలను చూసి బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితి.

 విజయవాడలో అయితే కనకాంబరం పూలు కిలో రూ. 2 వేలకు చేరుకోగా, చామంతులు కిలో రూ. 400 దాటింది. గులాబీలు కిలో రూ. 500 వరకూ పలుకుతుండగా, బంతిపూల ధర కిలోకు రూ. 80 పలికింది. ఇక పండ్ల ధరలూ అలాగే ఉన్నాయి. ధరలు ఇంతలా పెంచడంపై మహిళలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో తమకు అవసరమైన మేరకు అధిక ధరలకే పూలను కొనుగోలు చేసి వెళుతున్నారు.

Kanakambaram
Flowers
Varalakshmi Vratam
  • Loading...

More Telugu News