Vijayawada: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు వస్తోంది: జీవీఎల్

  • ‘ఉదయ్ డబుల్ డెక్కర్’ను త్వరలోనే ప్రారంభిస్తాం
  • వారంలో ఐదు రోజులు అందుబాటులో ఉంటుంది
  • కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాచారం ఇచ్చారన్న జీవీఎల్  

ఏపీలో ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్టణం మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు త్వరలో పరుగులు పెట్టనుంది. ఈ రైలు వారంలో ఐదు రోజులు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ప్రకటన చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘ఏపీ ప్రజలకు శుభవార్త’ అని, విశాఖపట్నం- విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని తాను రెండు నెలల క్రితం రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ని అభ్యర్థించానని పేర్కొన్నారు. త్వరలోనే రైలును ప్రవేశపెడతానని తనకు లేఖ ద్వారా గోయల్ ధృవీకరించారని జీవీఎల్ పేర్కొన్నారు. 

Vijayawada
Visakhapatnam
Uday double deckker
Train
Minister
piyush
goel
Mp
Gvl
  • Error fetching data: Network response was not ok

More Telugu News