YSRCP: వైఎస్ జగన్ గారూ, వైసీపీ వాళ్లకు J ట్యాక్ కట్టాల్సిందేనా?: నారా లోకేశ్

  • మీ వాళ్లను ఇలా అక్రమంగా దోపిడీకి వదిలేశారు
  • అవినీతిని తవ్వితీస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలా?
  • వాలంటీర్ పోస్టుల కోసమూ  J-ట్యాక్స్ కట్టించుకున్నారట

‘ఇంటి కోసం ఇటుక వేస్తే బిల్డరుకి J - ట్యాక్స్, దేశం కోసం హైవే వేస్తే కాంట్రాక్టరుకు J - ట్యాక్స్... ’ అంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపణలు చేశారు. ‘వైఎస్ జగన్ గారూ, రాష్ట్రంలో ఎవరు ఏ పని మొదలు పెట్టినా వైసీపీ వాళ్లకు ఈ ట్యాక్ కట్టాల్సిందేనా? మీ వాళ్లను ఇలా అక్రమంగా దోపిడీకి వదిలేసిన మీరు అవినీతిని తవ్వితీస్తాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు’ అని విమర్శించారు.

‘జాగ్రత్త!, మీరు అవినీతిని తవ్వుతున్నారని తెలిస్తే, అదేదో కాంట్రాక్టు అనుకుని మీ వాళ్లొచ్చి మిమ్మల్ని J-ట్యాక్స్ కట్టకుండా తవ్వడానికి వీల్లేదని అనేట్టు ఉన్నారు. వాలంటీర్ పోస్టుల కోసం కూడా  J-ట్యాక్స్ కట్టించుకున్నారని అంటున్నారు. నిజమేనా జగన్ గారూ?  

  • Loading...

More Telugu News