Anantapur District: ‘కియా’కు సహకరిస్తాం: ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

  • ఏపీలో ‘కియా’ మోటార్స్ తొలి కారు ‘సెల్టోస్’ విడుదల
  •  75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలి: రోజా
  • అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం: బుగ్గన

అనంతపురం జిల్లాలోని ‘కియా’ మోటార్స్ నుంచి తొలి కారు ‘సెల్టోస్’ ఈరోజు మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తదితరులు పాల్గొన్నారు. ‘సెల్టోస్’ ను లాంఛనంగా విడుదల చేశారు.

 అనంతరం, రోజా మీడియాతో మాట్లాడుతూ,‘కియా’ మోటార్స్ కు సహకరిస్తామని చెప్పారు. ‘కియా’లో 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Anantapur District
APIIC
chairperson
Roja
  • Loading...

More Telugu News