Ajit Doval: అబ్బో.. మా ఆర్ధిక వ్యవస్థకు చాలా నష్టమే!: పాకిస్థాన్ నిర్ణయంపై అజిత్ దోవల్ వెటకారం
- భారత్ తో పాక్ వాణిజ్య సంబంధాలు రద్దు
- దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుంది
- ఇన్స్టాగ్రామ్ లో కోహ్లీ పోస్ట్ పెడితే ఎంత ఆదాయం వస్తుందో అంత నష్టం
ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో... భారత్ తో వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. పాక్ తీసుకున్న నిర్ణయంపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెటకారంగా స్పందించారు.
'భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ రద్దు చేసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థకు పాక్ నిర్ణయంతో తీరని నష్టం వాటిల్లుతుంది. అది ఎంతగానంటే... విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఓ ప్రమోషనల్ పోస్ట్ పెడితే ఎంత ఆదాయం వస్తుందో అంత నష్టం భారత్ కు కలుగుతుంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో?' అంటూ అజిత్ దోవల్ ఎద్దేవా చేశారు. తద్వారా పాకిస్థాన్ నిర్ణయాన్ని పూచికపుల్లలా తీసి పడేశారు.