cm jagan: ఢిల్లీ నుంచి రాగానే నేరుగా ‘ఏరియల్ సర్వే’కు వెళ్లిన సీఎం జగన్

  • ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్
  • పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
  • జగన్ వెంట మంత్రులు సుభాష్ చంద్రబోస్, అనిల్ 

ఏపీలో కురుస్తున్న వర్షాలకు పోలవరం మండలంలోని గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఈరోజు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్ నేరుగా హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వేకు బయలుదేరి వెళ్లారు. జగన్ తో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం రాజమండ్రి విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. వరద ముంపుపై అధికారులతో సమీక్షించనున్నట్టు సమాచారం.

cm jagan
Gannavaram
Polavaram
Aerial survey
  • Loading...

More Telugu News