Andhra Pradesh: ఆకలితో అలమటిస్తున్న ఈ పేదల బాధ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా?: చంద్రబాబు ఆగ్రహం

  • వృద్ధులను 2-3 సార్లు ఆఫీసులకు తిప్పుతున్నారు
  • ఒకటో తేదిన ఇవ్వాల్సిన పింఛన్లు ఇంకా ఇవ్వకపోవడం ఏంటి?
  • ట్విట్టర్ వేదికగా మండిపడ్డ చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈరోజు ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సొంత పనులు చేసుకోడానికి కూడా శక్తి చాలని వృద్ధులను పింఛను కోసం రోజుకు రెండు, మూడుసార్లు చొప్పున వారం రోజులుగా అధికారులు ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన అందాల్సిన పింఛన్లు ఇంకా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆకలితో అలమటిస్తున్న పేదల బాధ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? అని నిలదీశారు.

‘అనవసర విషయాలపై కాకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? గతంలో ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడే వస్తున్నాయంటే నిర్లక్ష్యం కాదా? ఇప్పటికైనా మేలుకుని పెండింగ్ పింఛన్లను వెంటనే ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు పింఛన్లు అందక ఇబ్బంది పడుతున్న సామాన్యుల వీడియోలను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News