: పదవ తరగతి ఫలితాలు విడుదల
పదవ తరగతి ఫలితాలను మాధ్యమిక విద్యాశాఖా మంత్రి కొలుసు పార్థసారధి విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు 88.08 శాతం ఉత్తీర్ణత సాధించారు, ఈ ఫలితాలు గతేడాది కంటే 0.24 శాతం అధికం కాగా ఈ ఏడాది ఫలితాల్లో 88.90 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలదే పైచేయి అవగా, బాలురు 87.30 శాతం సాధించారు. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 94.92 శాతం ఉత్తీర్ణతతో మెదటి స్థానం సాధించగా, తూర్పుగోదావరి జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించింది. చిట్టచివరి స్థానంలో మెదక్ జిల్లా నిలిచింది. మొత్తం 172 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 3 ప్రభుత్వ, 6 ప్రైవేటు కళాశాలల్లో జీరో రిజల్ట్స్ వచ్చాయి. జూన్ 15 నుంచి 28 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 1 అని విద్యాశాఖా మంత్రి తెలిపారు.