Narendra Modi: మోదీ ఏం మాట్లాడతారోనని సర్వత్ర ఉత్కంఠ!

  • నేడు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం
  • ఆర్టికల్ 370 రద్దుకు దారితీసిన పరిస్థితులు వివరించే అవకాశం
  • పలు కీలక నిర్ణయాలను ప్రకటించే చాన్స్

నేడు ప్రధాని నరేంద్ర మోదీ, జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండగా, ఆయన ఏం మాట్లాడతారోనన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత దేశ రాజకీయ పరిస్థితులు, ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతినగా, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామన్న విషయమై, జాతికి మోదీ వివరణ ఇస్తారని, అదే సమయంలో కొన్ని సంచలన నిర్ణయాలను కూడా ఆయన వెలువరించవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

లోక్ సభలో పూర్తి బలం ఉన్నా, అన్ని బిల్లులనూ రాజ్యసభలో ముందు ప్రవేశపెట్టి, తమ వ్యూహాలతో వాటికి ఆమోదం పొందుతూ, ఆపై లోక్ సభలో ప్రవేశపెడుతున్న బీజేపీ, తదుపరి లక్ష్యాలను, దేశ ఆర్థిక వృద్ధిని పెంచుకునే దిశగా తీసుకోబోయే చర్యల గురించి ఆయన మాట్లాడవచ్చని తెలుస్తోంది. జీఎస్టీని మరింత సరళీకృతం చేయడం, విదేశీ పెట్టుబడులకు మరింత పెద్దపీట, కశ్మీర్ లో కొత్త ఇన్వెస్ట్ మెంట్స్, అక్కడి ప్రజలకు ఉపాధిని పెంచేలా తీసుకోబోయే నిర్ణయాల గురించి కూడా మోదీ ప్రస్తావించవచ్చని సమాచారం.

Narendra Modi
Article 370
Jammu And Kashmir
India
  • Loading...

More Telugu News