Article 370: ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు ఇండియా మాకు చెప్పలేదు: అమెరికా

  • భారత్ తమను లూప్ లైన్లో ఉంచిందని వ్యాఖ్య
  • గత సోమవారం పీ5 దేశాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ భేటీ
  • కశ్మీర్ పరిణామాలను వివరించిన వైనం

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయబోతున్నట్టు భారత్ తమకు సమాచారం ఇవ్వలేదని అమెరికా తెలిపింది. ఈ విషయంలో భారత్ తమను లూప్ లైన్లో ఉంచిందని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. మరోవైపు, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశాల ప్రతినిధులకు (అమెరికా సహా) కశ్మీర్ పరిణామాలను భారత విదేశాంగ శాఖ వివరించిన సంగతి తెలిసిందే.  

Article 370
Jammu And Kashmir
America
  • Loading...

More Telugu News