Andhra Pradesh: పాత పన్ను బకాయలుంటే ప్రజలు మాత్రం కట్టాలి.. కానీ రుణమాఫీ క్రింద రైతులకివ్వాల్సినది మాత్రం ప్రభుత్వం ఇవ్వదట : చంద్రబాబు

  • నా హయాంలో రైతులకు రుణమాఫీ చేశా
  • రైతులకు ప్రామిసరి నోట్లు కూడా ఇచ్చాం
  • ప్రస్తుత ప్రభుత్వం ఆ నోట్లు చెల్లవంటే ఎలా?

తన హయాంలో రైతులకు రుణమాఫీ కింద నాలుగు, ఐదు విడతల సొమ్మును బ్యాంకులో వేశానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అప్పుడు రైతులందరూ డబ్బులు డ్రా చేసుకున్నారని, వాళ్లందరికీ ప్రామిసరి నోట్లు కూడా ఇచ్చామని, ఆ నోట్లు చెల్లవా? ప్రభుత్వం ఇచ్చిందే చెల్లదా? అని ప్రశ్నించారు.  

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు పార్లమెంట్ లో మోదీ హామీ ఇస్తే, ఆ హామీని నిలబెట్టుకోమని మనం అడుగుతున్నాం కదా, అలాగే, గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఈ ప్రామిసరి నోట్లు ఇచ్చానని, దానికి డబ్బులు ఇవ్వమని రైతులు కోరుతుంటే, మీరు హామీలు ఇస్తే ‘మేమెందుకు ఇస్తామంటారా!’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి పన్ను లేదా వాటర్ సెస్, జీఎస్టీ కట్టని వాళ్లుంటారని, ఇప్పుడు, అవి మాత్రం వాళ్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రజలు బకాయి పడితే చెల్లించాలా? ప్రభుత్వం బకాయి పడితే మాత్రం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ డబ్బులు ఇచ్చే వరకూ వారికి తాను అండగా ఉంటానని, వదిలి పెట్టే సమస్యే లేదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News