cuddapah: కడప, అనంతపురంలో సీఎం జగన్ పర్యటన వాయిదా

  • సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆయా జిల్లాల్లో జగన్ పర్యటన
  • ప్రస్తుతం ఢిల్లీలో బిజీగా ఉన్న జగన్  
  • ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలిసిన జగన్ 

ఏపీ సీఎం జగన్ రేపు కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జగన్ బిజీగా ఉండటంతో రేపటి ఆయన పర్యటన వాయిదా పడింది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆయా జిల్లాల్లో జగన్ పర్యటిస్తారని సమాచారం. కాగా, ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిశారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరారని, విద్యుత్ ఉత్పాదక సంస్థల పీపీఏలపై సమీక్ష, రివర్స్ టెండరింగ్ తదితర అంశాలను జగన్ వివరించినట్టు సమాచారం.

cuddapah
Ananthapuram
cm
Jagan
Delhi
  • Loading...

More Telugu News