Jammu And Kashmir: కర్ఫ్యూ ఎత్తేయండి.. కశ్మీరీలు ఏం చేస్తారో తెలుస్తుంది: గులాం నబీ అజాద్

  • జమ్ముకశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది
  • కర్ఫ్యూ ఎత్తేస్తే జనాలు ఆగ్రహంతో రోడ్డెక్కుతారా? లేదా? అనేది తెలుస్తుంది
  • కేంద్రంపై కశ్మీరీల్లో వ్యతిరేకత ఉందని స్పష్టంగా చెప్పగలను

ఆర్టికల్ 370ని రద్దు చేయడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కశ్మీర్ లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ అన్నారు. జమ్ముకశ్మీర్ లో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోందని... ఈ సమయంలో అక్కడి పరిస్థితులను అంచనా వేయలేమని చెప్పారు.

ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తేస్తే.... ప్రజలు ఆగ్రహంతో రోడ్డెక్కుతారా? లేక సంతోషం వ్యక్తం చేస్తారా? అనే విషయం తెలుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కార్గిల్ ప్రాంతంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధ్వంసకర రాజకీయాలు చేస్తూ... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.

Jammu And Kashmir
Gulam Nabi Azad
Article 370
  • Loading...

More Telugu News