: 20 నుంచి ఇంటర్ ప్రవేశాల దరఖాస్తులు
రేండేళ్ళ ఇంటర్ విద్య లో ప్రవేశ ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. 20 వ తేదీ నుంచి కళాశాలల్లో దరఖాస్తుల విక్రయం ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 29వ తేదీ లోపు అందజేయాల్సి ఉంటుంది. జూన్ 6 నుంచి కళాశాలలు ప్రవేశాలను ప్రారంభించి అదే నెల 29 వరకూ కొనసాగించాలి. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ కళాశాలలకే కాకుండా ప్రైవేటు కళాశాలలకూ వర్తిస్తాయని సెకెండరీ విద్యాశాఖ తెలిపింది.