Andhra Pradesh: జగన్ గారూ.. బిల్డర్లపై ఇప్పుడు 'J-ట్యాక్స్’ విధిస్తే ఎలాగండీ.. ఇంతకూ మీ వాటా ఎంత?: నారా లోకేశ్

  • జగన్ దయతో ఏపీలో ఇసుక దొరకడం లేదు
  • బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారు.. కార్మికులు పస్తులతో పడుకుంటున్నారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇప్పటికే జగన్ దయవల్ల ఏపీలో ఇసుక దొరక్క బిల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, కార్మికులు ఆకలితో పడుకుంటున్నారని లోకేశ్ తెలిపారు.  ఇది చాలదన్నట్లు వైసీపీ నేతలు ఇప్పుడు బిల్డర్లపై జే-ట్యాక్స్(జగన్ గారి పార్టీ ట్యాక్స్) విధిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ నేతలు అనధికారంగా లక్షల రూపాయల మేర జే-ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. ఇందులో తన వాటా ఎంతో జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేశ్ ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ట్వీట్ కు జతచేశారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Chief Minister
Telugudesam
Nara Lokesh
Twitter
J TAX
  • Error fetching data: Network response was not ok

More Telugu News