Nagam Janardhan Reddy: హైదరాబాదులో సుష్మాస్వరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: నాగం

  • సుష్మాస్వరాజ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది
  • తెలంగాణ ఏర్పాటులో ఆమె కీలకపాత్ర పోషించారు
  • హైదరాబాదును యూటీ చేయాలనే ఆలోచనను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆమె... రాష్ట్ర ప్రజల మనసుల్లో చిన్నమ్మగా నిలిచిపోయారని చెప్పారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఆలోచనను కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. సుష్మకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు. హైదరాబాదులో సుష్మాస్వరాజ్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు.

Nagam Janardhan Reddy
Sushma Swaraja
KCR
  • Loading...

More Telugu News