Krishna District: 3వ తరగతి విద్యార్థి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ!

  • తన మాటను వినట్లేదన్న కోపంతో టెన్త్ విద్యార్థి హత్య
  • కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా చల్లపల్లి వెనుకబడిన కులాల వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య (8) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే హాస్టల్ లో ఉంటూ టెన్త్ చదువుతున్న విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. సోమవారం నాడు ఆదిత్యతో గొడవ పడిన నిందితుడు, పథకం ప్రకారం, బాలుడిని మూత్ర విసర్జనకు తీసుకెళ్లి, చంపేశానని అంగీకరించినట్టు సమాచారం. అతని నుంచి పెన్సిల్‌ చెక్కే బ్లేడ్‌, రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మూడే తరగతి చదివే ఆదిత్య ఎప్పుడూ, తన మాట వినట్లేదన్న కోపంతోనే ఈ హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, నిందితుడు గుంటూరు జిల్లాకు చెందిన వాడని, గత  కొన్నిరోజులుగా ఇద్దరూ కలిసే పడుకుంటున్నారని, అతడి వికృత చేష్టలకు భయపడుతున్న ఆదిత్య అతని పక్కన పడుకోబోనని చెప్పాడని, దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని సమాచారం. కాగా, ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఇన్‌ చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌ మన్‌ నాగబాబులను సస్పెండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News