sushma swaraj: మరణానికి కొన్ని గంటల ముందు.. మోదీకి ధన్యవాదాలు చెబుతూ సుష్మ ట్వీట్

  • ఈ రోజు కోసమే జీవితకాలం ఎదురుచూశా
  • రాత్రి ఏడున్నర ప్రాంతంలో ట్వీట్
  • అదే ఆమె చివరి ట్వీట్

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చనిపోవడానికి ముందు ఆమె చివరిసారి ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.

ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు లోక్‌సభలో ఆమోద ముద్ర పడిన వెంటనే సుష్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాత్రి ఏడున్నర సమయంలో ఆమె ట్వీట్ చేశారు. ఇది చూడడం కోసమే తాను జీవితకాలం ఎదురుచూశానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు.

sushma swaraj
BJP
Narendra Modi
article 370
  • Loading...

More Telugu News