Pakistan: ఆర్టికల్ 370 రద్దుపై అక్కసు వెళ్లగక్కిన చైనా... వంతపాడిన పాకిస్థాన్

  • జమ్మూకశ్మీర్ ను విభజించిన భారత్
  • ఆర్టికల్ 370 రద్దు  
  • ఆమోదయోగ్యం కాదన్న చైనా

జమ్మూకశ్మీర్ అంశంలో భారత ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తమ ప్రాదేశిక సౌర్వభౌమత్వాన్ని అణగదొక్కే విధంగా ఉందని రుసరుసలాడింది. భారత్ తీసుకున్న తాజా ఏకపక్ష విభజన నిర్ణయం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ పేర్కొన్నారు. ఇలాంటి వివాదాలను భారత్, పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతం అని స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద ఘర్షణలు రేకెత్తించే చర్యలకు దూరంగా ఉండాలని తాము భారత్ ను కోరామని ఆమె వివరించారు. కాగా, భారత్ నిర్ణయంపై చైనా చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రస్తావించారు. భారత్ నిర్ణయాన్ని చైనా కడిగిపారేసిందని ఆవేశం ప్రదర్శించారు.

Pakistan
China
India
Article 370
  • Loading...

More Telugu News