Jammu And Kashmir: కశ్మీర్ అంశంపై నాడు నెహ్రూ, నేడు మోదీ, అమిత్ షాల నిర్ణయం సరైనవే: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • నాడు కశ్మీర్ ను నెహ్రూ కాపాడారు 
  • కనుకనే, మోదీ, అమిత్ షా ఈ నిర్ణయం తీసుకోగలిగారు
  • దేశానికి కాంగ్రెస్, బీజేపీలు రెండూ అవసరమే

అప్పటి పరిస్థితుల రీత్యా  జమ్ముకశ్మీర్ అంశంపై నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయం, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయం సమర్థనీయమేనని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టికల్ 370కి సంబంధించిన బిల్లు రద్దు సందర్భంగా నెహ్రూపై మోదీ, అమిత్ షాలు చేసిన ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు. నాడు కశ్మీర్ ను నెహ్రూ కాపాడారు కనుకనే, నేడు మోదీ, అమిత్ షాలు ఈ నిర్ణయం తీసుకోగలిగారని చెప్పిన జగ్గారెడ్డి, దేశానికి కాంగ్రెస్, బీజేపీలు రెండూ అవసరమేనని వ్యాఖ్యానించడం ఆసక్తికరం.

Jammu And Kashmir
Article 370
Mla
Jagga Reddy
  • Loading...

More Telugu News