Anand Mahindra: ఆర్టికల్ 370 రద్దుపై విభిన్నంగా స్పందించిన ఆనంద్ మహీంద్రా

  • జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఎన్డీయే
  • కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన మహీంద్రా అధినేత
  • కశ్మీరీలను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకుందాం అంటూ ట్వీట్

జమ్మూకశ్మీర్ ను ఇన్నాళ్లు ప్రత్యేకంగా నిలిపిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో భారీగా స్పందనలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ అంశంపై తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అరే ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది అంటూ వ్యాఖ్యలు వినిపిస్తుంటాయని, ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా ఆ కోవలోకే వస్తుందని ట్వీట్ చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలన్నింటినీ పక్కనబెట్టి కశ్మీరీలను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకుందాం అంటూ సూచించారు. ఇప్పుడు కశ్మీరీలు మన జాతీయ సమాజంలో విడదీయరాని భాగమయ్యారని పేర్కొన్నారు.

Anand Mahindra
Article 370
Jammu And Kashmir
  • Loading...

More Telugu News