Nara Lokesh: వైసీపీ నేతల చిల్లర వ్యవహారం ఇలాగే ఉంటుంది: నారా లోకేశ్

  • ఆర్టికల్ 370 రద్దుపై లోకేశ్ పేరిట ఫేక్ ట్వీట్
  • స్పందించిన టీడీపీ యువనేత
  • ఏం చెయ్యాలో తెలియక ఇలాంటి దుష్ప్రచారాలంటూ మండిపాటు

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుపై తాను మరో విధంగా స్పందించినట్టుగా ఓ నకిలీ పోస్టును ప్రచారం చేస్తున్నారంటూ లోకేశ్ ఆరోపించారు. అంతేకాకుండా, ఆ ఫేక్ పోస్టు పక్కనే, తాను ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన ఒరిజినల్ పోస్టును కూడా పెట్టి ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ వ్యాఖ్యానిస్తూ, వైసీపీ నేతల చిల్లర వ్యవహారాలు ఇలా ఉంటాయని విమర్శించారు. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో, ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు తెరదీస్తుంటారని, బుగ్గన గారు, ఆయన భజన బృందం ఇలాంటి మాటలు మాట్లాడతారేమో కానీ, తాను కాదని స్పష్టం చేశారు. అయినా, ఇలాంటి దుష్ప్రచారాలు చేసే బదులు ప్రజలకు ఇచ్చిన హామీలపై శ్రద్ధ పెడితే కనీసం పరువైనా దక్కుతుంది కదా! అని లోకేశ్ హితవు ఇచ్చారు.

Nara Lokesh
YSRCP
Article 370
  • Error fetching data: Network response was not ok

More Telugu News