#MSD: వైరల్ అవుతున్న 'ఎంఎస్డీ' ట్యాగ్... ధోనీ మాత్రం కాదండోయ్!

  • ఆర్టికల్ 370 రద్దు వెనుక మోదీ, షా, ధోవల్
  • వారి పేరిట హ్యాష్ ట్యాగ్ వైరల్
  • అందాల కశ్మీరం రావాలని ఆకాంక్ష

ఎంఎస్డీ (MSD)... ఈ పేరు వింటే గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా, ఆపై కీపర్ గా, బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా ధోనీకి ఉన్న పేరు, గుర్తింపు ఎంతో అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు మాత్రం ఎంఎస్డీ పేరిట ఓ ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. అది ధోనీకి సంబంధించినది మాత్రం కాదు.

ఇక్కడ 'ఎంఎస్డీ' అంటే 'మోదీ, షా, ధోవల్'... వీరి ముగ్గురి పేరిట ట్విట్టరాటీలు ఓ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. దశాబ్దాల నుంచి అమలులో ఉన్న ఆర్టికల్ 370 రద్దుపై ప్రతి ఒక్కరూ మోదీ సర్కారును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసాధ్యమనుకున్న దాన్ని వీరు ముగ్గురూ కలిసి సుసాధ్యం చేశారని, ఇక జమ్మూ కశ్మీర్ లో శాంతిని నెలకొల్పి, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిని సారించాలని సలహా ఇస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఉన్న అందాల కశ్మీరం మరోసారి రావాలని కోరుకుంటున్నారు. 

#MSD
MS Dhoni
Narendra Modi
Amit Shah
Ajit Dhoval
Jammu And Kashmir
Article 370
  • Loading...

More Telugu News