Irfan pathan: నా మనసు, హృదయం రెండూ కశ్మీరీలతోనే: టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్

  • జమ్ముకశ్మీర్ నుంచి వందమందికిపైగా క్రికెటర్లను వెనక్కి పంపిన ప్రభుత్వం
  • జమ్ముకశ్మీర్ జట్టుకు మెంటార్‌గా ఇర్ఫాన్ సేవలు
  • దులీప్ ట్రోఫీపై నీలినీడలు

దులీప్ ట్రోఫీలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ వెళ్లిన దాదాపు వందమందికిపైగా క్రికెటర్లను రెండు రోజుల క్రితం ప్రభుత్వం వెనక్కి పంపింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో భద్రతా కారణాల రీత్యా వీరందరినీ వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కోరడంతో వీరంతా కశ్మీర్‌ను విడిచిపెట్టారు. అలా వెనక్కి వచ్చిన వారిలో టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కోచ్ మిలాప్ మేవడా, ట్రైనర్ సుదర్శన్ కూడా ఉన్నారు.

ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ స్పందిస్తూ.. తన మనసు, హృదయం రెండూ కశ్మీరీలతోనే ఉన్నట్టు పేర్కొన్నాడు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కశ్మీరీ సోదరులు, అక్కచెల్లెళ్ల కోసం అవి తపిస్తున్నాయని పేర్కొంటూ కశ్మీర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. జమ్ముకశ్మీర్ జట్టు ఆటగాడిగా, మెంటార్‌గా ఇర్ఫాన్ సేవలందిస్తున్నాడు. కాగా, ఈ నెల 17 నుంచి  దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుండగా అది ముగిసిన వెంటనే విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీలు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

  • Loading...

More Telugu News