Visakhapatnam District: విశాఖ హెచ్‌పీసీఎల్ విస్తరణ పనుల్లో అపశ్రుతి.. ఇద్దరి దుర్మరణం

  • మట్టిపెళ్లలు విరిగిపడడంతో తీవ్ర గాయాలు 
  • మరొకరి పరిస్థితి విషమం
  • బాధితులను జార్ఖండ్‌కు చెందిన వారిగా గుర్తింపు

విశాఖపట్టణంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విస్తరణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆసుపత్రిలో నిర్మాణ పనులు జరుగుతుండగా కూలీలపై ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతులను జార్ఖండ్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Visakhapatnam District
HPCL
jharkhand
  • Loading...

More Telugu News