Article 370: రక్తపాతానికి కారణమైన ‘370’ పరిసమాప్తమైంది: అమిత్ షా

  • ఆర్టికల్ 370 రద్దు చేస్తే ప్రపంచం మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
  • ఈ బిల్లు రద్దుపై కొంత మంది నిజాలు దాచిపెట్టారు
  • రాజ్యసభలో అమిత్ షా

దీర్ఘకాలం రక్తపాతానికి కారణమైన ఆర్టికల్ 370 పరిసమాప్తమైందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై అమిత్ షా వివరణ ఇస్తూ..  జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గుర్తుచేసుకోవాల్సిన క్షణాలివని అన్నారు. ఈ ఆర్టికల్ కారణంగా ఎలాంటి పరిణామాలు వస్తాయో ఆనాడే చెప్పారని గుర్తుచేశారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన కష్టనష్టాలపై చాలామంది ఏకరవు పెట్టారని, దీన్ని రద్దు చేస్తే ప్రపంచం మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారని విమర్శించారు. ఈ బిల్లు రద్దుపై కొంత మంది నిజాలు దాచిపెట్టారని మండిపడ్డారు. ఆర్టికల్ 370 కారణంగా.. పెద్ద పర్యాటక సంస్థలు పెట్టుబడులు పెట్టడం లేదని, పాక్ నుంచి భారత్ వచ్చిన శరణార్థులకు దేశ వ్యాప్తంగా ఓటు హక్కు వచ్చింది కానీ, ఆ శరణార్థులకు జమ్ముకశ్మీర్ లో మాత్రం ఓటు హక్కు రాలేదని అమిత్ షా అన్నారు. 

  • Loading...

More Telugu News