Article: జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పరిధి పీవోకేకూ వర్తిస్తుంది: నిర్మలా సీతారామన్

  • ఆర్టికల్ 370 ఎన్నో పురోగామి చట్టాలకు అడ్డంకి 
  • ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సమాన అవకాశాలకు 370 రద్దు తప్పనిసరి
  • రద్దు చేస్తామని మా మేనిఫెస్టోలోనే చెప్పాం

విస్తృత సంప్రదింపుల తర్వాతే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం ఎన్నో పురోగామి చట్టాలకు అడ్డంకిగా మారిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సమాన అవకాశాలకు ఆర్టికల్ 370 రద్దు తప్పనిసరని అన్నారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పరిధి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కూ వర్తిస్తుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలోనే చెప్పిందని, జనసంఘ్ రోజుల నుంచే ఈ విషయంపై చర్చ జరుగుతోందని గుర్తుచేశారు. 

Article
370
Minister
Nirmala sitaramana
  • Loading...

More Telugu News