BJP: ఆర్టికల్ 370 రద్దుపై బాలీవుడ్ లో దాదాపు అందరిదీ ఒకే మాట!

  • ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బాలీవుడ్ ప్రముఖులు
  • ఇది సాహసోపేత నిర్ణయం అంటూ ప్రశంసలు
  • అమరవీరులకు ఇదే సరైన నివాళి అంటూ వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని చారిత్రాత్మక రీతిలో రద్దు చేసిన ఎన్డీయే సర్కారుపై బాలీవుడ్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు దాదాపుగా సర్కారు నిర్ణయానికి తమ మద్దతు ప్రకటించారు. వివేక్ ఓబెరాయ్, మాధుర్ భండార్కర్, కంగనా రనౌత్, పరేశ్ రావల్, దియా మీర్జా తదితరులు మోదీ, అమిత్ షాలు తీసుకున్న నిర్ణయం సబబేనంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇది సాహసోపేత నిర్ణయం అని, మోదీ అందుకు తగిన వ్యక్తి అని కొనియాడారు. దేశాన్ని ఉగ్రవాద రహితంగా చేయడంలో ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. నేడు భారతమాతకు పరిపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని పరేశ్ రావల్ వ్యాఖ్యానించారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఇదే సరైన నివాళి అని వివేక్ ఓబెరాయ్ అభిప్రాయపడ్డారు.

BJP
Narendra Modi
Amit Shah
Bollywood
Article 370
Jammu And Kashmir
  • Loading...

More Telugu News