Central Government: కేంద్ర ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఆర్ఎస్ఎస్

  • ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై హర్షం
  • దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం అత్యావశ్యం
  • ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) హర్షం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం అత్యావశ్యమని చెప్పింది. స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి, మద్దతుగా నిలవాలని ఆర్ఎస్ఎస్ కోరింది.

Central Government
Article 370
RSS
PM
Modi
  • Loading...

More Telugu News