Article: ఆర్టికల్ 370 రద్దు సంతోషకరమైన విషయం: బీజేపీ సీనియర్ నేత అద్వానీ

  • ఈ అధికరణ రద్దు బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటి
  • జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ముందడుగు
  • ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు

ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ సీనియర్ నేత అద్వానీ స్పందించారు. దీన్ని రద్దు చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు. అధికరణను రద్దు చేయడం బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటని, జనసంఘ్ రోజుల నుంచే ఈ ప్రతిపాదనలు ఉన్నాయని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్ లో శాంతి, సుఖ సంతోషాల దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా వేసిన ముందడుగుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు తెలియజేస్తున్నట్టు అద్వాణీ పేర్కొన్నారు.

Article
370
BJP
Senior Leader
Advani
  • Loading...

More Telugu News