Telangana: అక్రమ సంబంధంపై అనుమానం.. భార్యా, పిల్లలను కిరాతకంగా చంపిన భర్త!

  • తెలంగాణలోని వికారాబాద్ లో ఘటన
  • భార్యకు అక్రమ సంబంధముందని అనుమానించిన భర్త
  • పోలీసులకు సమాచారమిచ్చి లొంగుబాటు

అనుమానం ఓ నిండు కుటుంబాన్ని బలిగొంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం నడుపుతోందని అనుమానించిన భర్త ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను కూడా హత్యచేశాడు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ లో చోటుచేసుకుంది. వికారాబాద్ లోని మోతీబాగ్ కాలనీలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య చాందిని, అయాన్, ఏంజెల్ అనే పిల్లలు ఉన్నారు.

అయితే చాందిని మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సదరు భర్త అనుమానించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో సహనం కోల్పోయిన అతను చాందినీని దారుణంగా హత్యచేశాడు. అనంతరం పిల్లలను కూడా చంపేశాడు. చివరికి పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

Telangana
extra martial affair
wife and kids killed
by husband
Police
vikarabad
  • Loading...

More Telugu News