triple talaq: ట్రిపుల్ తలాక్ చట్టంపై భార్య హర్షం.. తలాక్ చెప్పి ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్త

  • ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన రాజ్యసభ
  • విషయం తెలిసి ముస్లిం మహిళ సంబరాలు
  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన

ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చిందన్న ఆనందంలో ఉన్న భార్యను చూసి ఆగ్రహంతో ఊగిపోయిన భర్త ఆమెకు తలాక్ చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా, బింద్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిగ్ని గ్రామంలో జరిగింది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించిన విషయం తెలుసుకున్న ముఫీదా ఖాతూన్ సంతోషంతో ఎగిరి గంతులేస్తుండగా చూసిన భర్త షంషుద్దీన్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే భార్య దగ్గరికి వెళ్లి ముమ్మారు తలాక్ చెప్పాడు. అంతేకాదు, ఆ వెంటనే ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టినట్టు బింద్కీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ తివారీ తెలిపారు. ముఫీదా ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

triple talaq
Uttar Pradesh
muslim woman
  • Loading...

More Telugu News